మ్యాన్ ఆఫ్ మాస‌స్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే .. దేవర లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వెంటనే వార్ 2 షూటింగ్లో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ .. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .  బాలీవుడ్ దర్శ‌కుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.  స్పై యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక ఇందులో ఎన్టీఆర్ స్పెషల్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారని అలాగే హృతిక్ - ఎన్టీఆర్ మధ్య భారీ ఫైట్ సీన్స్ కూడా అదిరిపోయే రీతిలో ఉండబోతున్నాయని టాక్ .. అదేవిధంగా వీరిద్దరి కాంబోలో మాస్ సాంగ్స్ సైతం ఉంటుందని తెలుస్తుంది.  


 అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే వార్‌ 2 సినిమాల్లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్. ఎస్ .. వార్ 2 మూవీలో స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్‌ వినిపిస్తుంది .. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని అంటున్నారు . స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో కీయ‌రా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా ఇప్పుడు శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్స్ చేయబోతుంది .. హృతిక్ - ఎన్టీఆర్ - శ్రద్ధ కాంబోలో ఈ సాంగ్ ఉండబోతుందని బాలీవుడ్ లో టాక్ ..


ఇప్పటికే శ్రద్ధ మంచి డాన్సర్ .. అలాగే బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది .. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది  ఈ బ్యూటీ ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పటంతో ఆమె అభిమానులు కొంత ఆశ్చర్యపోతున్నారు. అయితే నిజానికి పుష్పా 2లోనే ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్ చేయాల్సింది .. కానీ రెమ్యూనరేషన్ విషయంలో డీల్ కుదరకపోవడంతో ఆ సాంగ్ మిస్ అయింది .. ఇక ఇప్పుడు మరోసారి వార్ 2లో శ్రద్ధ కపూర్ స్పెషల్ సాంగ్స్ తో మరోసారి హాట్‌ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: