![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/thandel-movieeb15c94a-e51f-40bf-ba11-5f91014c47a4-415x250.jpg)
ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 62.37 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని స్వయంగా తండేల్ మూవీ యూనిట్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. దింతో గేమ్ చెంజర్ కంటే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. అక్కినేని నాగచైతన్య కెరీర్ లో తండేల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా తన కెరీర్ లో అత్యంత వేగవంతమైన కలెక్షన్లను రాబట్టిన సినిమాగా తండేల్ నిలిచింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బుజ్జ తల్లి పాటకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య నటనకు మంచి గుర్తింపు లభించింది. కాగా, ఈ సినిమా స్టోరీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా స్టోరీకి ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. వాలెంటైన్ వీక్ కావడంతో ప్రేమికులు తండేల్ సినిమాను చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా, ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంలో చిత్ర బృందం మరో రెండు రోజుల్లో సక్సెస్ మీట్ ను నిర్వహించే ప్లాన్ లో ఉన్నారట. ఈ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.