![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/samatnah-mobile-wallpapaer-viralb58fb389-399c-4777-8c96-91820e1deddd-415x250.jpg)
నిరంతరం ఏదో ఒక విషయంలో సమంత పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా సమంత బయటికి వచ్చినప్పుడు మీడియా మిత్రులు తీసిన కొన్ని ఫోటోలలో సమంత మొబైల్ లో స్క్రీన్ పై ఎవరి ఫోటో ఉందనే విషయం బయటపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సమంత చేతిలో మొబైల్ పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చినప్పుడు ఆ మొబైల్లో లింగ భద్రాదేవి ఫోటో కనిపించిందట. అందుకు సంబంధించి ఫోటోలు కూడా కొన్ని వైరల్ గా మారుతున్నాయి. అలాగే సమంత మరొక చేతిలో పూల బొకే పట్టుకొని బ్లాక్ కలర్ దుస్తులు వేసుకొని మరి చాలా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం సమంత గుడ్ లుక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సమంతకి ఎక్కువగా దేవుళ్ళ పైన మంచి భక్తి ఉన్నది. అందుకే ఎన్నోసార్లు దేవాలయాలకు కూడా వెళుతూ ఉంటుంది సమంత. సమంత మొబైల్ లో కూడా లింగభద్రదేవి ఫోటో కనిపించడంతో సమంత పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. చివరిగా 2023లో విజయ్ దేవరకొండ తో ఖుషి చిత్రంలో నటించిన ఇప్పటికీ రెండేళ్లు అవుతున్న సమంత తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. గత ఏడాది హనీ బన్నీ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తదుపరి చిత్రాన్ని అభిమానుల కోసం ప్రకటిస్తుందేమో చూడాలి.