నాగార్జున ఆ పోస్ట్ లో డియర్ చైతన్య.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. తండేల్ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం పరిధులు దాటడం చూశా తండేల్ సినిమా మాత్రమే కాదు నీ ఫ్యాషన్ అని పేర్కొన్నారు. తండేల్ మూవీ చైతన్య కష్టానికి నిదర్శనం అని నాగ్ చెప్పుకొచ్చారు. అక్కినేని ఫ్యాన్స్ మా కుటుంబ సభ్యులలా ఎల్లప్పుడూ మా వెన్టే ఉన్నారని నాగార్జున కామెంట్లు చేయడం గమనార్హం.
ఫ్యాన్స్ ప్రేమ, సపోర్ట్ కు ధన్యవాదాలు అని నాగార్జున చెప్పుకొచ్చారు. సాయిపల్లవికి కంగ్రాట్స్ అని దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ అని నాగ్ పేర్కొన్నారు. చందూ మొండేటి రైజింగ్ స్టార్ అని తండేల్ బృందానికి నిర్మాతలకు బిగ్ థ్యాంక్స్ అని నాగ్ వెల్లడించారు. నాగార్జున వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
తండేల్ మూవీ మూడు రోజుల్లో 62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. తండేల్ మూవీ సాధిస్తున్న కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. నాగచైతన్య భవిష్యత్తు సినిమాలతో కెరీర్ బెస్ట్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తండేల్ సినిమా సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. మిడిల్ రేంజ్ హీరోలలో నాగచైతన్య సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.