అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నాగచైతన్య నటించిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. హిట్లు, ఫ్లాప్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఇక నాగచైతన్య నుంచి వచ్చిన తాజా చిత్రం తండేల్. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. 


అంతే కాకుండా ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 62.37 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. చైతన్య కెరీర్ లోనే అత్యంత వేగంగా కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ చిత్రం నిలిచింది. ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. చందు మొండేటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరించారు.

సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ సక్సెస్ మీట్ కు అక్కినేని నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. తన కొడుకు కోసం నాగార్జున సక్సెస్ మీట్ కు రాబోతుండడం విశేషం. కాగా, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తారా లేదా తెలంగాణలోనే నిర్వహించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ మేరకు ఇప్పటికే తండేల్ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కోసం ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ కూడా తీసుకున్నారట. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: