
బాలయ్యకి స్టార్ ఇమేజ్ వచ్చాక మాస్ సినిమాలు ఎక్కువగా చేశారు . అయితే ఒక దర్శకుడు మాత్రం బాలయ్యకు స్టార్ ఇమేజ్ వచ్చాక ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వే లో ముందుకెళ్ళి సినిమాను తెరకెక్కించాడు . ఆయన మరెవరో కాదు స్టార్ దర్శకుడు కోదండరామిరెడ్డి . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే బయటపెట్టాడు . "అది బాలయ్య 50వ సినిమా అనుకుంటా ..బాలయ్య కెరియర్ లో అది ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవాలి అని కోరుకున్నాను . అలాగే జరిగింది . అసలు ఏ ధైర్యంతో బాలయ్య అలాంటి చిత్రం చేసారు అని ఇప్పటికీ ఒక సందేహం ఉంది .
అంతేకాదు నేను యాక్షన్ సినిమాలు చేశాను . ఈసారి బాలయ్యతో కంప్లీట్ గా రొమాంటిక్ కామెడీ చిత్రంగా చేయాలి అనుకున్నాను. ఆ టైంలోనే ఇద్దరు హీరోయిన్స్ గా ఉండే సబ్జెక్టుని చూస్ చేసుకున్నాను. బాలయ్యకు కథ చెప్పగానే ఓకే చేశారు . మేము మెయిన్ గా ఫోకస్ చేసింది పాటలపైనే . అవి చాలా అద్భుతంగా వచ్చాయి. ఫలితంగా ఒక ఫైట్ కూడా లేకపోయినప్పటికీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అంటూ కోదండరామిరెడ్డి చెప్పారు". ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? శోభన - నిరోషా హీరోయిన్లుగా బాలకృష్ణ హీరోగా నటించిన "నారీ నారీ నడుమ మురారి". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ను బయటపెట్టింది..!