![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/padma-bhushan-balayya303c00c4-15bb-4d91-b291-21c4b99f9a9c-415x250.jpg)
ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు .. అయితే అందులో ఒక పాత్ర నెగిటివ్ రోల్ అని మరో పాత్ర పాజిటివ్ రోల్ అని తెలుస్తుంది .. అలాగే ఇంటర్వెల్లో బాలయ్య రెండో పాత్ర రివిల్ అవుతుందని .. ఇక ఈ సీక్వెన్స్ ఏ సినిమా మొత్తానికి హైలెట్ గా మారుతుందని అంటున్నారు . ఇప్పటికే ఈ సినిమాలో నటించే నటనలు ఎంపికపై దర్శకుడు బోయపాటి ప్రత్యేక దృష్టి పెట్టారు .. కీలక పాత్రలో ఇతర భాషలో నటులను కూడా తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు .. ఇప్పుడు వరకు బోయపాటి తెరకెక్కించిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమా మాత్రం మరో రేంజ్ లో ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది ..
అలాగే ఈ సినిమాను 14 రిలీస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. బాలయ్య తమన్ ఈ సినిమాకు మరోసారి తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు .. బోయపాటి , బాలయ్య కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి ,, ఇక ఇప్పుడు అఖండ 2 తో ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను దుమ్ము దులుపుటానికి రెట్టింపు ఉత్సాహంతో భారీ అంచనాలతో ఈ సినిమా రాబోతుంది. ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై ఎలాంటి చరిత్ర సృష్టిస్తారో చూడాలి.