జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర  సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో పాటు ఎన్టీఆర్ కెరియర్ లో 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలిచాక ప్రపంచమంతా టాలీవుడ్ వైపు దృష్టి పెడుతోంది. ఇది కేవలం రాజమౌళికి మాత్రమే పరిమితం కావడం లేదు. వివిధ తెలుగు సినిమాల మీద పరిశీలనలు జరుగుతున్నాయి.ఇటీవలే పుష్ప 2 క్లైమాక్స్ వీడియో క్లిప్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ హ్యాండిల్ లో షేర్ చేస్తే దానికి ఒక్క రోజులోనే పాతిక మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భగవంత్ కేసరిలో మ్యాన్ హోల్ క్యాప్ అడ్డం పెట్టుకుని తుపాకీ గుళ్ల వర్షాన్ని బాలయ్య అడ్డుకునే ఫైట్ చాలా వైరలయ్యింది. ఇవే కాదు బాహుబలి, మగధీర, సాహు, హనుమాన్ లాంటివెన్నో ఇంగ్లీష్ జనాలకు రీచవుతున్నాయి.దేవర కూడా ఈ జాబితాలో చేరిపోయింది. నాలుగుసార్లు గ్రామీ పురస్కారం దక్కించుకున్న విజేత ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్. బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఇతను ప్రముఖ బ్రిటిష్ గాయకుడు. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నాడు. బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో దేవరలోని చుట్టమల్లే పాటను పాడి ఆహుతులను ఆశ్చర్యానికి గురి చేశాడు.

నిజానికిది ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే చెన్నైలో జరిగిన కన్సర్ట్ లో ఊర్వశి ఊర్వశి పాడినప్పుడు అది దశాబ్దాల తరబడి ఊపేసిన రెహమాన్ కంపోజింగ్ కాబట్టి ఎంజాయ్ చేశారు. అందులోనూ ఫాస్ట్ బీట్. కానీ చుట్టమల్లే అలా కాదు. రొమాంటిక్ స్లో మెలోడీ. తెలుగు వస్తే తప్ప ఆస్వాదించలేం.అయినా షీరాన్ నోటి వెంట దేవర పాట వినడం తారక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్స్ టా స్టోరీ లో షేర్ చేసుకున్నాడు కూడా. ఈ పరిణామాలు చూస్తుంటే తెలుగు సినిమా అంతర్జాతీయ సరిహద్దులు దాటినట్టేనని చెప్పాలి. ఎందుకంటే తలలు పండిన కంపోజర్లకు ఇప్పటికీ కలగా మిగిలిన గ్రామీని అన్ని పర్యాయాలు అందుకున్న షీరన్ గుర్తు పెట్టుకుని గాయకి శిల్ప రాయ్ తో దేవర గానం చేయడం చిన్న విషయం కాదు. రాబోయే రోజుల్లో మన ప్యాన్ ఇండియా మూవీస్, వాటిలో సంగీతం, పాటల మీద ఇంటర్నేషనల్ సింగర్స్ సైతం దృష్టి పెడతారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తయిన వెంటనే దేవర 2 సినిమా ఉండబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: