![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chiranjeevi-64a7895d-7101-4829-b2a2-83a2b122c514-415x250.jpg)
మరీ ముఖ్యంగా బాలకృష్ణ - తారక్ ఫ్యాన్ అయితే నేను రాకూడదా అంటూ చిరంజీవి మాట్లాడిన విధానం అందరికీ షాకింగ్ అనిపిస్తుంది. చిరంజీవి మాట్లాడుతూ.." హీరోలు హీరోలు బాగానే ఉన్నారు . ఫ్యాన్స్ కొట్టుకునేస్తున్నారు. ఏంటో అర్థం కావడం లేదు. విశ్వక్సేన్ సినిమాకి నేను గెస్ట్ గా వెళ్తున్నాను అని చెప్పినప్పుడు అతడు మన కాంపౌండ్ కాదు అని బాలకృష్ణ - తారక్ అంటూ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అని చాలామంది అన్నారు . బాలకృష్ణ ఫ్యాన్ అయితే నేను రాకూడదా? ఇండస్ట్రీ అంతా ఒకటే ..ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కాదు "..అంటూ చిరంజీవి తనదైన స్టైల్ లో హీరోల పేరుతో ఫాన్స్ చేసే ట్రోలింగ్స్ ను తిప్పకొడుతూ ఘాటు కౌంటర్స్ వేశారు .
అంతేకాదు ఆయన మాట్లాడుతూ.." ఫ్లోలో టంగ్ కూడా స్లిప్ అయ్యారు. మా ఇంట్లో ఉన్న రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్ అని.. ఆయన సినిమాలను లైక్ చేస్తూ ఉంటారు అని .. ఇక ఇండస్ట్రీలో ఈ కాంపౌండ్ అనే పదం ఎందుకు ..???అంటూ పరోక్షకంగా చిరంజీవి తన కొడుకు ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయాన్ని బయట పెట్టేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . కాగా చిరంజీవి మాట్లాడిన మాటలను చాలామంది పాజిటివ్ గానే తీసుకుంటున్నారు . కానీ కొంతమంది మాత్రం చిరంజీవికి హెడ్ వెయిట్ అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు పుష్ప2 సినిమాకి సపోర్ట్ చేయని విషయాన్ని మరొక సారి గుర్తు చేసుకుంటూ ఆయనను ఆయన మాటలను ద్వంద అర్థాలతో ట్రోల్ చేస్తున్నారు..!