![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/bollywood6bf31b47-af10-4235-84dd-134c4aed4b4a-415x250.jpg)
అయితే జైల్లో ఉన్నప్పుడు మాత్రం ఎంతో హాయిగా కావాల్సినంత సమయం నిద్రపోయా జైల్లో నాకు చేయడానికి పని లేదు .. అందుకే నిద్రపోయేవాడిని .. అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు .. ఇక్కడ చాలామంది అలసిపోయామని పడుకుంటారు కానీ మీరు మాత్రం ఎంత అలసిపోయిన ఎప్పుడూ పడుకోవద్దు .. ఏదైనా వేరే పని చేయడం మొదలుపెట్టలి అప్పుడు నిద్ర దానంతట అదే వస్తుందని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. అయితే సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేట ఆడిన కేసులో నిందితుడిగా ఉన్నారు .. 2006లో కోర్టు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది .. కోర్టు విధించిన కొద్ది రోజుల్లోనే సల్మాన్ బెయిల్ పై బయటకు వచ్చారు ..
అలాగే 2018లో కోర్ట్ మరోసారి సల్మాన్ కు శిక్ష విధించింది.. ఈ సమయంలో కూడా కొద్ది రోజుల్లోనే సల్మాన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ హీరోసౌత్ దర్శకుడు మురగదాస్ తో సికిందర్ సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది. వచ్చే రంజాన్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది .. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది .. సికిందర్ సినిమాతో పాటు ఈ కండలు వీరుడు కిక్2 సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమాలతో అయినా సల్మాన్ ఖాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తానేంటో మరోసారి రీఎంట్రీ ఇవ్వాలని గట్టి ప్లాన్ తో ఉన్నాడు.