మన్మథుడు సినిమాతో తెలుగులో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది అన్షు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అన్షుకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర మూవీ లో హీరోయిన్‌గా నటించింది. అనంతరం మళ్లీ ఇప్పుడు దాదాపుగా 23 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు లో మజాకా మూవీతో ఎంట్రీ ఇస్తోంది అన్షు.సందీప్ కిషన్, రీతు వర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన మజాకా మూవీలో అన్షు కీలక పాత్ర చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న అన్షు విలేకరుల సమావేశం లో సందీప్ కిషన్, ప్రభాస్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.అవేమిటంటే రాఘవేంద్ర షూటింగ్ సెట్ కు ప్రభాస్ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకొచ్చేవారా అని యాంకర్ అడగ్గా దీనికి ఆమె స్పందించారు. ఇంటి నుంచి ఫుడ్ తెప్పించేవారు. మిగతా కోయాక్టర్స్ కూడా ఇలా చెప్పడం వింటున్న. ఆయనకు చాలా సిగ్గు. రిజర్వడ్ గా ఉండేందుకు ఇష్టపడతారు. కానీ, ఒక్కసారి ఆయన కనెక్ట్ అయితే ఆయన బెస్ట్. ఆయన లవ్లీ పర్సన్ అని చెప్పుకొచ్చారు.ఇదిలావుండగా తన రీ ఎంట్రీ గురించి అన్షు ఇలా చెప్పుకొచ్చింది.మన్మథుడు రీ రిలీజ్‌కి వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంట్లో వారి సపోర్ట్ తో మళ్లీ ఈ సినిమాతో తెరపైకి రావడం ఆనందంగా ఉంది. ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ క్యారెక్టర్స్ కోసం సంప్రదిస్తున్నారు. ఇందులో చాలా మదర్ రోల్స్ ఉన్నాయి. అయితే కేవలం ఒకే తరహ పాత్రలు చేయాలని లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శక నిర్మాతలు మరిన్ని వైవిధ్యమైన పాత్రల కోసం అప్రోచ్ అవుతారనే నమ్మకం ఉంది అని అన్నారు.చూడాలి మరి 25ఏళ్ల తరువాత సినిమాలలో తన రీ ఎంట్రీ ఎలాంటి విజయానికి దారితిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: