ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు, కమెడియన్స్ సైతం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో పొలిటికల్ గురించి మాట్లాడుతూ చాలా ట్రోల్స్ గురవుతున్నారు. వీటివల్ల సినిమా పరిశ్రమ కూడా దెబ్బతినేలా కనిపిస్తూ ఉన్నది. ఈ ఏడాది విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇలానే మాట్లాడారు కానీ ఈ సినిమా గోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇవే కాకుండా ఇలా మాట్లాడిన చాలా సినిమాలు కూడా ప్లాపులుగానే మిగిలిపోయాయి. ఇటీవలే చిరంజీవి కూడా లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం జరిగింది.

 మెగా ,అల్లు కుటుంబం మధ్య గొడవలు అంటూ వస్తున్న వార్తలపై కూడా ఆయన ఇలా స్పందిస్తూ.. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఎంత క్రేజ్ దక్కించుకున్నారో ఆ సక్సెస్ ని మనం చూసాము. అలాగే పుష్ప 2 సక్సెస్ మనందరికీ గర్వకారణం అంటూ కూడా తన మేనల్లుడు అల్లు అర్జున్ సినిమాని కూడా ఆయన ప్రశంసించారు. ఇది చూసి మెగా,అల్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ చిరంజీవి కామెంట్స్ కు శభాష్ అంటున్నారు. ఇదే విషయంపై సినిమా ఈవెంట్లలో పొలిటికల్ పరంగా స్పందించడంతో కాస్త విమర్శలు గుప్పిస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ సినిమా ఈవెంట్లలో రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటి ? అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


 చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అనే విషయానికి వస్తే.. బాలకృష్ణ ఎక్కువగా రాజకీయాల గురించి స్పందించరు. అందుకే ఇలాంటి విషయాలలో బాలకృష్ణ గ్రేట్ అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మాత్రం బాలకృష్ణ, చిరంజీవి లాగా అందరితో కలిసి పోలేరు. డిగ్నిటీ మెయింటెన్ చేస్తారని కూడా కామెంట్లు చేస్తున్నారు.  ఎందుకంటే గత కొంతకాలంగా చిరంజీవి, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వినిపించినా..  వారి గురించి అన్ని పబ్లిక్ ఈవెంట్లలో చిరంజీవి మాట్లాడుతారు. అదే బాలకృష్ణ తన అన్నయ్య కొడుకు ఎన్టీఆర్ (NTR) తో  విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చినా.. ఏ రోజు కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించింది లేదు. ఇదంతా పక్కన పెడితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో మాత్రం బాలయ్య ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడారు.. ఈమధ్య మెగా కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుతూ ఉండడంతో అటు మెగా కుటుంబం బాలయ్యకు మధ్య తేడా ఇదే అని తెలుపుతున్నారు నేటిజన్స్.. మరి ఇకనైనా సినీ ఇండస్ట్రీలో సినిమాల గురించే మాట్లాడుతారా లేకపోతే రాజకీయాలని ఉపయోగిస్తారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: