మస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం "లైలా". ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన హీరోయిన్ గా ఆకాంక్ష శర్మ నటించింది. కాగా ఈ సినిమాలో విశ్వక్సేన్ మొదటిసారిగా లేడీ గెటప్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకోనున్నారు. లేడీ గెటప్ లో విశ్వక్సేన్ చాలా అందంగా కనిపించారు. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నిర్వహించారు. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.

 అంతేకాకుండా ఈవెంట్ కు సినీ ప్రముఖులు విచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేశారు. కాగా, ఈ సినిమాలో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వి రాజ్ కూడా కీలక పాత్రను పోషించాడు. ఈ ఈవెంట్ లో నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశాడు. దీంతో ఒక వర్గానికి పృథ్వి రాజ్ మాట్లాడిన మాటలు తీవ్రంగా కోపాన్ని తెప్పిస్తున్నాయి.


సినిమాలోని ఓ కీలక సన్నివేశం గురించి పృథ్వి రాజ్ చెబుతూ ఇందులో నేను మేకల సత్తిగా నటించానని తెలిపాడు. అయితే మేకలు ఎన్ని ఉన్నాయని షార్ట్ మధ్యలో అడగగా 150 ఉన్నాయని తెలిపారు. అయితే షాకింగ్ ఏమిటో తెలియదు కానీ ఈ సినిమా చివరిలో లెక్క వేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయని పృథ్వి రాజ్ తెలిపాడు. ఇదేంటో అసలు అర్థం కాలేదని అన్ని సినిమాలలో బ్రహ్మాండంగా పెట్టారంటూ పృథ్వీరాజ్ కామెంట్ చేశారు. అయితే పృధ్విరాజ్ వైసిపి పార్టీని ఉద్దేశించి ఇలా కామెంట్లు చేశాడని వైసిపి కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు.


దీంతో లైలా సినిమాను బై కాట్ చేయాలని అంటున్నారు. ఇక ఈ గొడవలోకి హీరో విశ్వక్సేన్ దిగబోతున్నారు. పృధ్వి రాజ్ చేసిన వ్యాఖ్యలకు హీరో విశ్వక్సేన్ వైసీపీ కార్యకర్తలకు, జగన్ కు క్షమాపణలు చెప్పబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: