![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylee8e1e87a-5cc8-416b-9815-7e7c4f3b0ad5-415x250.jpg)
ప్రేమలు సీక్వెల్ గురించి కూడా గత ఏడాది అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఐతే ప్రేమ కథలకు సీక్వెల్ రావడం చాలా అరుదు. ప్రేమలు సినిమా భాషతో సంబంధం లేకుండా యూత్ ఆడియన్స్ కు నచ్చేసింది.ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో మళ్లీ హైదరాబాద్ టచ్ ఉండేలా చూస్తున్నారట. ప్రేమలు లో హైదరాబాద్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. మళయాళంలోనే కాదు తెలుగు ఆడియన్స్ కు రీచ్ అయ్యేందుకు అది బాగా ఉపయోగపడింది. అందుకే ప్రేమలు 2 లో కూడా హైదరాబాద్ ఇంకా తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఇంకా ఇక్కడ రిఫరెన్స్ లు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇదిలావుండగా ప్రేమలు 2 తో మమితా మరోసారి యూత్ ఆడియన్స్ కు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. దీంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.