టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏమాయ చేసావే సినిమాతో నటిగా తనకు తాను పరిచయం చేసుకున్న ఈ చిన్నది ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమాలో తనదైన నటన, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.

సినిమా అనంతరం సమంత వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. దాదాపు పదేళ్లకు పైనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోలు అందరి సరసన జతకట్టి ఆడి పాడింది. ఇక కొద్ది రోజుల నుంచి సమంత తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు.


బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేసుకుంటూ అక్కడ సెటిల్ అయిపోయింది. తాను చేసే వెబ్ సిరీస్ లకు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. సమంత తెలుగులో సినిమాలలో నటిస్తున్న సమయంలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత తన సినిమాను చేయాలని బ్లాక్ మెయిల్ చేశాడట.


తాను చెప్పిన సినిమా చేయకపోతే నీకు ఎలాంటి సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడట. అంతేకాకుండా నీ అంతూ చూస్తానని టార్చర్ చేశాడట. తమిళ ఇండస్ట్రీ వైపుకు రమ్మని బలవంతం చేశారట. కానీ సమంత అవేవీ పట్టించుకోకుండా తెలుగు సినిమాలలోని నటించి అగ్ర హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: