![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nagachithanya-precident-anr-meeat156e230e-295e-418b-b359-387961433f63-415x250.jpg)
ఇటీవలే నాగచైతన్య అమ్మవారికి సైతం ముక్కులు చెల్లించుకున్నారు. విజయవాడకు వెళ్లిన చైతూ ఆల్ ఇండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు అయినటువంటి సర్వేశ్వరరావు గృహానికి వెళ్లారట. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని తెలుసుకొని మరి అక్కడికి వెళ్లి పరామర్శించడంతో పాటుగా కొద్దిసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తమకు తెలియజేయాలి అంటూ నాగచైతన్య ఆ కుటుంబానికి సహాయం చేస్తాను అంటూ కూడా మాట ఇచ్చారట.
ఈ విషయం విన్న అక్కినేని ఫ్యాన్స్ సైతం నాగచైతన్య చేసిన పనికి ప్రశంసిస్తూ ఉన్నారు. తండేల్ మూవీ శ్రీకాకుళం కి చెందిన మృత్యుకారుల బ్యాక్ డ్రాప్లా తీయడం జరిగింది. శ్రీకాకుళంలో ఉండే కొంతమంది జాలర్లు పాకిస్తాన్ చేతికి చిక్కి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆధారంగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్స్ కాబట్టి చైతూ కెరియర్ లోని బెస్ట్ మూవీ గా నిలుస్తుందేమో చూడాలి. తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో తీయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.