![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie3de7e2fe-fe4d-4098-ba56-00446ce01c25-415x250.jpg)
ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల సెలెక్ట్ అయినట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే పుష్ప2 సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ కొట్టాలి అంటే కచ్చితంగా అది పాన్ ఇండియా ఫిలిం అయి ఉండాలి అని.. అందుకే సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో - అల్లు అర్జున్ చేతులు కలిపాడు అంటూ తెగ వార్తలు వినిపించాయి. ఒకానొక టైంలో వీళ్ల సినిమా క్యాన్సిల్ అయిపోయింది అంటూ కూడా మాట్లాడుకున్నారు.
కాగా రీసెంట్ గానే హైదరాబాద్ కి అట్లీ టీం వచ్చింది . అంతే కాదు అల్లు అర్జున్ ని కలిసినట్లు మాట్లాడినట్లు సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . వైరల్ అయిన వార్త నిజం కాబోతుంది అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో మూవీ రాబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఈ సినిమా పుష్ప2కి మించిన స్థాయిలో హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీనిపై అఫీషియల్ ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??