![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/naga-chaitanyabdcdec11-154c-45f6-8f8d-4ceaf815ea8f-415x250.jpg)
సీన్ కట్ చేస్తే తండేల్ నాగచైతన్య సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు నాగచైతన్య ఈ సినిమాతో వేరే లెవెల్ లోకి వెళ్లిపోయాడు . సాయి పల్లవి నటనకు మించిన రేంజ్ లోనే నాగచైతన్య పర్ఫామెన్స్ ఉంది అని నాగచైతన్యలో తెలియని నటుడు దాగున్నాడు అని మాట్లాడుకుంటున్నారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో నాగచైతన్యకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నాగ చైతన్య తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు అని .. ఆ సినిమాలు చేసుంటే నాగచైతన్య ఎప్పుడో "తండేల్" సినిమా లాంటి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అని మాట్లాడుకుంటున్నారు .
నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "భలే భలే మగాడివోయ్" సినిమాలో ముందుగా హీరోగా నాగచైతన్య ని అనుకున్నారట. ఆ తర్వాత అది నాని చేతికి వెళ్లిపోయింది . అంతేకాదు సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాలో కూడా ముందుగా హీరోగా నాగచైతన్య నే అనుకున్నారట . ఈ సినిమాను నాగచైతన్య రిజెక్ట్ చేశాడు . ఆ తర్వాత ఆఫర్ సుధీర్ బాబుకు వెళ్ళింది . అంతేకాదు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన "అ ఆ" కూడా ముందుగా నాగచైతన్య వద్దకే వెళ్ళాయట . అన్ని కూడా నాగచైతన్య రిజెక్ట్ చేయడం గమనార్హం . అలా నాగచైతన్య మంచి మంచి అవకాశాలను రిజెక్ట్ చేసి నెగిటివ్ ట్రోల్లింగ్ కి గురయ్యారు . ఇప్పుడు తండేల్ సినిమా హిట్ అయిన కూడా అది తీసుకెళ్లి శోభిత ధూళిపాళ్ల ఖాతాలో వేస్తున్నారు.. ఆమె లక్ కారణంగానే ఈ సినిమా హిట్ అయిందని మాట్లాడుతున్నారు . దీంతో నాగచైతన్య జాతకం ఇంత దరిద్రంగా ఉంది ఏంటి అంటూ ట్రోలర్స్ మీమర్స్ ఆడేసుకుంటున్నారు..!