![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/vishwak-sen-sorry-politices72835d47-927e-4691-a69b-50a1ee359f00-415x250.jpg)
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి కామెంట్లు 150 గొర్రెలు ఉండేవి సినిమా వచ్చేసరికి 11 గొర్రెలే ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని సైతం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒక్కసారిగా బాయికాట్ లైలా అనే ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో విశ్వక్సేను కూడా ఆశ్చర్యపోయారని ఈ విషయం పైన అటు హీరో నిర్మాత సాహూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇందుకోసం ఒక ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో విశ్వక్ మాట్లాడుతూ ఫలానా వ్యక్తి స్టేజ్ మీద ఎలా మాట్లాడుతారో అనే విషయం ఎవరు కంట్రోల్ చేయలేము ఆయన స్టేజి మీద మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు రావడం జరిగింది. తాను నిర్మాత సాహు గారు చిరంజీవి గారిని వెళ్లి రిసీవ్ చేసుకునేందుకు బయటికి వెళ్లామని తెలిపారు.
కానీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి చూసేసరికి ఒక్కసారిగా సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అని కనిపించి ఆశ్చర్యపోయానని .. తీరా చూస్తే పృథ్వి మాట్లాడిన మాటలకు అన్నట్లుగా తెలుస్తోంది.. ఒకవేళ ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడే ఉంటే కచ్చితంగా ఆపే వాళ్ళం లేకపోతే క్షమాపణలు చెప్పే వాళ్ళమని తెలిపారు. స్టేజ్ మీద మాట్లాడిన ఆ వ్యక్తి అనుభవం అంత వయసు కూడా తమకు లేదని ఆయన అలా ఎందుకు మాట్లాడారు మాకు తెలియదంటూ తెలిపారు. ఎవరో చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయవద్దు అంటూ కోరుకుంటున్నారు విశ్వక్. మాది సినిమా ఈవెంట్..రాజకీయాలు మాట్లాడకూడదని కానీ అలా అనుకోకుండా జరిగింది అని.. ఆయన మాట్లాడేటప్పుడు తాను ఉన్నానని నిరూపిస్తే ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోతానని తెలిపారు విశ్వక్.