కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ సినిమా ప్రేమికులు ఎక్కువ శాతం ఓటీటీ కంటెంట్ ను చూసేవారు కాదు. ఎప్పుడైతే మనదేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి ఓ టి టి కంటెంట్ ను చూడడానికి జనాలు బాగా అలవాటు పడ్డారు. అందుకు ప్రధాన కారణం కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా అనేక రోజుల పాటు కరోనా లాక్ డౌన్ ఉండడం , ఆ తర్వాత కూడా సినిమా థియేటర్లకు జనాలు రావట్లేదు అని సినిమా థియేటర్లను మూసివేయడం వల్ల ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు కొత్త కొత్త ప్లాట్ ఫామ్ లను వెతకడం మొదలు పెట్టారు. అందులో భాగంగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లకి జనాలు బాగా అలవాటు పడ్డారు.

అప్పటి నుండి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో జనాలు సినిమాలను చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ ఓ టి టి ప్లాట్ ఫామ్ల వల్ల నిర్మాతలకు లాభం అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తే , నష్టం అనే అభిప్రాయాలను మరి కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక సినిమా విడుదల అయిన తర్వాత దానికి అద్భుతమైన టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ తక్కువ రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి వస్తే ఆ మూవీ ద్వారా ఆ నిర్మాతకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఓ సినిమా విడుదల అయిన తర్వాత ఆ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ ఓ టి టి లోకి రావడం వల్ల నిర్మాతకు పెద్దగా ఎలాంటి నష్టం ఉండదు.

ఇక ఏదేమైనా కూడా నిర్మాత సినిమా విడుదలకు ముందు సేఫ్ జోన్ లోకి వెళ్లడానికి ఓ టీ టీ లు చాలా బాగా ఉపయోగపడతాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ముందే ఓ టి టి హక్కులను అమివేస్తారు కాబట్టి దాని ద్వారా నిర్మాతలకు భారీగా లాభం వస్తుంది. అందుకే ఓ టి టి ల ద్వారా నిర్మాతలకు ఎంతో లాభం అని అభిప్రాయాలను చాలా మంది వ్యక్త పరుస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: