సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులు కొంత మంది హీరోలను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు . వారితో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే కూడా ఆనంద పడుతూ ఉండేవారు చాలా మంది ఉన్నారు . ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో ప్రియమణి ఒకరు. కెరియర్ ప్రారంభం నుండి ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది.

దానితో ఈమె చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించింది. ఇకపోతే ఈమెకు బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం అంట. ఇక ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం ఈమె ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిందంట. ఆమెకు షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. తన అభిమాన నటుడి సినిమాలో అవకాశం రావడంతో ప్రియమణి ఏకంగా ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిందట.

ఇలా తన అభిమాన హీరో సినిమాలో అవకాశం రావడంతో ఒక్క రూపాయి కూడా పారీతోషకం తీసుకోకుండా ఆ సినిమాలో నటించి తన అభిమానాన్ని ప్రియమణి నిరూపించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ద్వారా ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితం షారుక్ "జవాన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా కూడా ఈమెకి మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: