సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి అతి తక్కువ సమయం లోనే అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సినిమాల ద్వారానే కొంత మంది అద్భుతమైన స్థాయికి ఎదుగుతూ కూడా ఉంటారు. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపును సంపాదించుకొని ఎక్కువ శాతం చిన్న సినిమాల్లో నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణుల్లో కామాక్షి భాస్కర్ల ఒకరు. ఈ నటి మా ఊరి పొలిమేర అనే సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.

మూవీ పెద్దగా అంచనాలు లేకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ మా ఊరి పొలిమేర సినిమాకు కొనసాగింపుగా రూపొందిన మా ఊరి పొలిమేర 2 లో కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె వరస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తుంది. తాజాగా టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కామాక్షి భాస్కర్ల అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఈ బ్యూటీ ఆ డ్రెస్ లో హాట్ లుక్ లో ఉండడంతో ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ ఈ బ్యూటీ వైపు తిరిగాయి. దానితో ప్రస్తుతం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామాక్షి భాస్కర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: