మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష , చిరుకు జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే చిరంజీవి తన నెక్స్ట్ మూవీ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇది ఇలా ఉంటే చిరంజీవి , అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే తాజాగా చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల క్రితం ఇంద్ర అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇకపోతే శ్రీకాంత్ , చిరంజీవి తో తెరకెక్కించబోయే సినిమాలో కాస్త ఫ్యాక్షన్ టచ్ ను కూడా చూపించబోతున్నట్లు కొన్ని ఫ్యాక్షన్ నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలు ఈ మూవీ లో ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా , నాని హీరోగా ది పారడైజ్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇది వరకే వీరి కాంబోలో రూపొందిన దసరా మూవీ మంచి విజయం సాధించడంతో ది పారడైజ్ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: