అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 350 కోట్లు దాటింది.. ఇక ఈ విజయం మామూలు విజయం కాదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇక పాన్ ఇండియా మూవీలను పక్కకు నెట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కొట్టడంతో చాలామంది ఇప్పటికి కూడా ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. అంతే కాదు చాలా రోజుల తర్వాత వెంకటేష్ కి సంబంధించి ఒక మంచి సినిమా చూసాము అని వెంకీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.అయితే ఈ సినిమాలో నటించిన వెంకటేష్ కి మాత్రమే కాదు సినిమాని తీసిన అనిల్ రావిపూడి కి కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన అనిల్ రావిపూడి ఖాతాలో ఇది మరొక హిట్ అనుకోవచ్చు. 

ఇప్పటివరకు అనిల్ రావిపూడి తీసిన 8 సినిమాల్లో బ్లాక్ బస్టర్సే.. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. అలా ఫ్లాప్స్ లేని డైరెక్టర్ లిస్టులో అనిల్ కూడా చేరిపోయారు.అయితే అలాంటి అనిల్ రావిపూడి తాజాగా విశ్వక్సేన్ హీరోగా చేస్తున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. అయితే  ఈ ఈవెంట్ కి యాంకర్ సుమ హోస్ట్ గా చేసింది. అందులో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన అనిల్ రావిపూడి ని మీరు వచ్చే జన్మలో అమ్మాయిలా పుట్టాలి అనుకుంటే ఏ హీరోయిన్ లాగా పుట్టాలనుకుంటారు అని ప్రశ్నించింది. దానికి అనిల్ రావిపూడి అప్పటి జనరేషన్లో అయితే శ్రీదేవి లాగా పుట్టాలి అనుకుంటాను.

ఇప్పటి జనరేషన్ లో అయితే తమన్నా లాగా పుట్టాలి అనుకుంటాను.. అంటూ  షాపకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇక ఈయన ఇచ్చిన ఆన్సర్ కి అక్కడున్న వాళ్ళందరూ అరుపులతో ఈలలు వేశారు. ఇక అనిల్ రావిపూడి మాటల్ని బట్టి చూస్తే ఆయనకు శ్రీదేవి,తమన్నా అంటే బాగా ఇష్టం అని తెలుస్తుంది.ఇక ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజెన్స్ కూడా కస్సక్ లాంటి ఫిగర్ పైనే అనిల్ రావిపూడి కన్నేసారు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: