మాస్ మహారాజ్ రవితేజ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఆయన చివరి సినిమా మిస్టర్ బ‌చ్చ‌న్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. దానికి ముందు వచ్చిన ఈగల్ కూడా ఫాన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. దీంతో 2024లో మాస్ మహారాజ్ కు అసలు హిట్ పడలేదు. అయితే 2025లో మాత్రం పక్కా హిట్ కొట్టాల‌ని రవితేజ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు. తాజాగా రవితేజ ఓ సినిమాకు సైన్ చేసినట్టు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతుంది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ కిషోర్ తిరుమలతో రవితేజ తర్వాత సినిమా చేయబోతున్నట్టు సమాచారం. 

ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా తర్వాత కిషోర్ తిరుమల మరో సినిమా చేయలేదు. ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇప్పుడు రవితేజకు ఆయన క‌థ వినిపించ‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కిషోర్ తిరుమల క్లాస్ సినిమాలు తీస్తుంటాడు. రవితేజ ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా రాబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత మాడ్ దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడు.

ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత కిషోర్ తిరుమల సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాడా లేదంటే 20026లో ఈ సినిమా పట్టాలెక్కుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మ‌రో వైపు రవితేజ కామెడీని కూడా పండించగలడు, ఎమోషన్స్ కూడా పండించగలడు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లా ఉండే అవకాశం కూడా ఉందని అర్థమవుతోంది. ఇటీవల ఫ్యామిలీ సినిమాలకే క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. కాబట్టి వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు కూడా ఫుల్ క్రేజ్ ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: