![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/sankrthiki-vasthunam-movie-telivision-zee54c061532-0d83-4da9-b8a3-eadbbc36a882-415x250.jpg)
వెంకటేష్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సంక్రాంతికి వస్తున్న అన్ని ఏరియాలలో కూడా సినిమా కొన్న బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. దీంతో బయర్లందరూ కూడా ఒక పార్టీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సినిమా కోసం ఓటిటి ఆడియన్స్ చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీలో కంటే ముందుగానే టీవీలో రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ చానల్ జీ తెలుగు టీవీలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రసారం కాబోతున్నదట. అందుకు సంబంధించి అధికారికంగా జీ తెలుగు కూడా ప్రకటించింది ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమాని ఓటీటిలో విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రముఖ సంస్థ ZEE -5 ఈ సినిమా ఓటిటి రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చానల్లో టెలికాస్ట్ అనౌన్స్మెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వెంకటేష్ అభిమానులను ఫ్యామిలీ ఆడియన్స్ అని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వెంకటేష్ తదుపరిచిత్రం ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం చిరంజీవితో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.