ఈ సంక్రాంతికి థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవగా సంక్రాంతికి వస్తున్నాం అంతకుమించిన విజయాన్ని సొంతం చేసుకుంది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమాకు ఫిదా అయ్యారు. సంక్రాంతికి థియేటర్లన్నీ ఫుల్ అయ్యాయి. 

ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఓటిటి లవర్స్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ సినిమా ఓటిటి కంటే ముందు టీవీలో ప్రసారం కాబోతుంది. ఈ విషయాన్ని జీతెలుగు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి వైబ్ ను మళ్లీ పునరుజ్జీవింప‌చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ సంక్రాంతికి వస్తున్నాం త్వరలో జీ తెలుగులో... అంటూ పేర్కొంది ఈ పోస్టులో టీవీ బీఫోర్ ఓటీటీ, ఫస్ట్ టీవీలో వస్తున్నాం... అంటూ టాగ్స్ ఇచ్చింది.

దీంతో ఓటీటీలో విడుదలయ్యే కంటే ముందే టీవీలో వస్తుందని క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమా టీవీలో వస్తుందని ప్రకటించినప్పటికీ ఏ డేట్ రోజు వస్తుందో క్లారిటీగా తెలపలేదు. త్వరలోనే సినిమా టెలికాస్ట్ అయ్యే రోజును కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20 నుండి ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే థియేటర్లలో దుమ్ము లేపిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు టీవీలకే అతుకుపోయే అవకాశం ఉంది. మరి ఆరోజు టీఆర్పీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: