తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వారిలో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు . ఈయన ఎన్నో తమిళ సినిమాలకు సంగీతం అందించి అద్భుత మైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు . అలాగే కొన్ని సినిమాలను తన మ్యూజిక్ తోనే విజయం వైపు తీసుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తమిళ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిరుద్ ఈ మధ్య కాలంలో వరస పెట్టి తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే అనేక తెలుగు సినిమాలకు సంగీతం అందించిన అనురుద్ తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే ప్రస్తుతం అనిరుద్ చేతిలో చాలా తెలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన మ్యూజిక్ అనే సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ అనే సినిమా కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందించాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే దేవర పార్ట్ 2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. ఇలా తెలుగులో అనిరుద్ వరుస పెట్టి సినిమాలకు సంగీతం అందిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: