తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అద్భుతమైన స్థాయికి చేరుకున్న నటులలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో నటించాడు. అలా కెరీయర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈయన సినిమాల్లో హీరో గా అవకాశాలను దక్కించుకొని అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే రవితేజ కు ఈ మధ్య కాలంలో సరైన విజయాలు దక్కడం లేదు. ఆఖరుగా రవితేజ నటించిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఏ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి శ్రీ లీల ,  రవితేజ కు జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా రవితేజ ఓ క్లాస్ డైరెక్టర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజమూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువ శాతం కిషోర్ తిరుమల క్లాస్ ఎంటర్టైనర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక రవితేజతో ఈయన తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: