టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నారు. అందులో కొంతమంది దర్శకులు మాత్రమే వారి సినిమాల ద్వారా సక్సెస్ సాధిస్తారు. అలాంటివారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులు ఆకట్టుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే సినిమాలు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన కెరీర్ లో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడం విశేషం. 

అనిల్ రావిపూడి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని మెగాస్టార్ చిరంజీవితో తీయబోతున్నట్లుగా ఇదివరకే అనౌన్స్ చేశారు. అయితే ఈ విషయం పైన తాజాగా క్లారిటీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి తన తదుపరి సినిమాను తీయబోతున్నారట.


అయితే ఈ విషయం పైన తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నిన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడితో చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమాకు సాహు - కొణిదెల సుస్మిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు.


కోదండరామిరెడ్డితో ఉన్న కెమిస్ట్రీ అనిల్ రావిపూడితో క్రియేట్ అవుతుందని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారట. ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట. మరి హీరో చిరంజీవి సినిమాకు ఎంత స్థాయిలో రెమ్యూనరేషన్ అడుగుతుంది అనే సందేహంలో ఉన్నారట. మరి ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: