
ముఖ్యంగా మెగా అభిమానులు తమని ట్రోల్ చేస్తున్నారని రామ్ చరణ్ కూడా తనతో మంచి రిలేషన్ ఉందంటూ వెల్లడించారు. తండేల్ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయిని తగ్గించాను అంటూ కొంతమంది పనిగట్టుకుని ట్రోల్ చేశారని కానీ తాను దిల్ రాజు పరిస్థితిని చెప్పే క్రమంలోనే అలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడాలననీ.. వాటిని కొంతమంది మెగా అభిమానులు తప్పుగా ఫీల్ అయ్యి ట్రోల్ చేస్తున్నారంటూ వెల్లడించారు. చరణ్ తనకు ఉన్న ఏకైక మేనల్లుడు అని అలాగే చరణ్ కు ఉన్న మేనమామను తానే అంటూ తెలిపారు. తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపారు.
ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలి అంటూ కోరారు. ఒకవేళ ఎవరైనా ఫీల్ అయితే సారీ అంటూ తెలియజేశారు.అల్లు అరవింద్ గతంలో తండేల్ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ చెర్రీ సినిమాను ఆయనను తక్కువ చేసిన వ్యాఖ్యలు ఒక విలేకరు ప్రస్తావించారని అల్లు అరవింద్ తెలియజేశారు. తాను స్పందిస్తూ తండేల్ సినిమా ఈవెంట్లో స్పందించడం కరెక్ట్ కాదని అప్పుడు నో చెప్పానని తెలియజేశారు. రామ్ చరణ్ కూడా తనకు ఒక కుమారుడు లాంటివారు అంటూ వెల్లడించడం జరిగింది. మరి ఇక మీదట ఆయన ఈ ట్రోలింగ్ సైతం ఆగిపోతుందేమో చూడాలి మరి. ఈమధ్య తరచూ చాలామంది సినీ సెలెబ్రిటీలు కూడా కొన్ని కారణాల చేత ట్రోలింగ్ కి గురవుతూ ఉన్నారు.