ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డును సైతం ప్రకటించింది. దీంతో దేశం మొత్తం బాలయ్య వైపు తిరిగి చూసింది. ఇదిలా ఉంటే బాలయ్య చిన్నవయసులోనూ ఎంతో అందంగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఆయన తండ్రి ఎన్టీరామారావు రూపు రేఖలతో కనిపిస్తూ ఆయన ముఖం వెలిగిపోతూ ఉండేది. కాగా ప్రస్తుతం ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బాలకృష్ణ కుర్రాడి వయసులో ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
వీడియోలో బాలయ్య స్టైల్ గా నీళ్లు పడవేస్తూ యాక్టింగ్ రిహార్సల్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు అచ్చం బాలయ్య ఆయన మనవడు దేవాన్ష్ లా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఫేస్ కట్ అచ్చం దేవాన్స్ ఫేస్ కట్ లానే ఉందని అభిప్రాయపడుతున్నారు. ముక్కు, ముఖం అచ్చం మనవడిలానే కనిపిస్తున్నాయని దేవాన్ష్ ఫోటోలు మరియు వీడియోలను కామెంట్స్ పెడుతున్నారు. ఇక బాలయ్య కూతురు నారా బ్రాహ్మిణి కూడా ఆయనలానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు తాత పోలికలు మనవడికి కూడా వచ్చాయని కామెంట్ల రూపంలో ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. మరి ఫ్యూచర్ లో దేవాన్ష్ కూడా తాతలా స్టార్ హీరో అవుతాడా లేదా రాజకీయాల్లోకి వచ్చి మరో తాతలా సీఎం అవుతారా చూడాలి.