టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య, లేడి పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా మొదటిరోజు పూర్తి అవ్వకముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులకు మనసు దోచుకుంది. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది.  హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకుంది. ఈ మూవీ  హిట్ కొట్టడంతో ఈ మూవీ టీమ్ సక్సెస్ కావడంతో సంబరాల్లో మునిగిపోయారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి వెళ్లిన ఓ మహిళ అభిమాని కంటతడి పెట్టుకుంది. సినిమా చూస్తే తీవ్ర భావోద్వేగానికి గురైయ్యింది. సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి లవ్ లో లీనమైన ఆ మహిళ చాలా ఏడ్చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా సినిమాకు ఎమోషనల్ గా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అని అనుకుంటున్నారు. ఇక నాగచైతన్య, సాయి పల్లవి జంటగా మరోసారి నటించిన ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: