టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన బెస్ట్ సినిమాలలో సీతారామం ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. సాధారణంగా లవ్ స్టోరీలను సాడ్ ఎండింగ్ తో ముగించడానికి మేకర్స్ అస్సలు ఇష్టపడరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
అయితే సీతారామం విషయంలో మాత్రం మేకర్స్ ఈ రిస్క్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన సినిమాలలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉంటే సెకండాఫ్ నిరాశ పరిచిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే సీతారామం సినిమాలో మాత్రం ఫస్టాఫ్ ఎంత అద్భుతంగా ఉందో సెకండాఫ్ కూడా అంతే అద్భుతంగా ఉంది. దుల్కర్, మృణాల్ ఈ సినిమాలో తమ పాత్రలకు ప్రాణం పోశారు.
 
మృణాల్ కు సీతారామం మూవీ తొలి తెలుగు మూవీ అయినప్పటికీ ఆమె తన నటనతో ఆకట్టుకోవడంతో పాటు తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. మృణాల్ తెలుగులో వరుస సినిమాలలో నటిస్తుండగా ఆమె పాత్రలకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టైర్1 స్టార్ హీరోలకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే సినిమాలకు సంబంధించి మృణాల్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. మృణాల్ ఠాకూర్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. మృణాల్ భవిష్యత్తు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్లాసిక్ సినిమాలలో సీతారామం ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా సత్తా చాటిందనే సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: