నాగార్జున మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా గీతాంజలి కాగా ఈ సినిమాలో నాగార్జున యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తెలుగులో మణిరత్నం డైరెక్ట్ గా తెరకెక్కించిన ఏకైక సినిమా ఈ సినిమానే కావడం గమనార్హం. గీతాంజలి మూవీ తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ అయ్యి అక్కడి ప్రేక్షకులను సైతం అంచనాలను మించి మెప్పించింది.
 
అప్పట్లోనే ఈ సినిమా క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలను అందుకోవడం గమనార్హం. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో గిరిజ నటించగా ఆమె తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కేవలం 60 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకోవడం గమనార్హం. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా వేటూరి పాటలు రాశారు. ఈ సినిమాలోని ప్రతి పాట అద్భుతం అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
గీతాంజలి సినిమా ఈ జనరేషన్ ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చుతుందంటే ఈ సినిమా ప్రత్యేకత సులువుగానే అర్థమవుతుంది. ఈ సినిమాలోని పాటలను బాలు, చిత్ర, ఎస్.జానకి పాడగా వాళ్లు తమ గాత్రంతో పాటలకు ప్రాణం పోశారని చెప్పవచ్చు. గీతాంజలి సినిమా అప్పట్లో కమర్షియల్ గా కూడా హిట్ గా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.
 
గీతాంజలి సినిమా దర్శకుడు మణిరత్నంకు కూడా మంచి పేరును తెచ్చిపెట్టిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. రొమాంటిక్ ట్రాజెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందని చెప్పవచ్చు. గీతాంజలి సినిమాలోని గీతాంజలి పాత్రలో గిరిజను తప్ప ఎవరినీ ఊహించలేరు. యూట్యూబ్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర, కూలీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు నాగార్జునకు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: