బాలకృష్ణ, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్.. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే 56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిన ఈ సినిమాలో చాందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. విలన్ గా బాబీ డియోల్ నటించారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఓటీటిలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ఎదురుచూరగా తాజాగా ఓటీటి ఫ్యాన్స్ కి మరొక గుడ్ న్యూస్ తెలుపుతోంది.



డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే బాలయ్య డాకు మహారాజ్ స్ట్రీమింగ్ పైన ఇప్పటివరకు అధికారికంగా ఓటీటి ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా  స్ట్రిమింగ్ కాబోతోందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. అయితే వచ్చేవారం ఈ సినిమా రాబోతున్నట్లు టాకు వినిపిస్తోంది. ఇదే సందర్భంలో బాలయ్య ఫ్యాన్స్ కి ఒక సడన్ సర్ప్రైజ్ ఉంటుందట.


డాకు మహారాజ్ సినిమాలో మరికొంత కొత్త కంటెంట్ ను సైతం ఓటీటిలో చేర్చే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తాందట. థియేటర్లో చూడని డాకు మహారాజ్ లోని కొన్ని సన్నివేశాలను సాంగ్స్ ను డైరెక్టర్గా ఓటిటీ కంటెంట్ లో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏఏ సన్నివేశాలు ఉంటాయో అంటూ అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన కూడా అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సంగీతం తమన్ అద్భుతంగా అందించడంతో సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలయ్య , బోయపాటి కాంబినేషన్లో అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: