![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/jr-ntrs-luck-continues-with-devaracffa88b7-3c7f-4179-95ef-e1eaa6cdee93-415x250.jpg)
అయితే ప్రదీప్ రంగనాథన్ సినిమాకు సైతం డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరిగింది. అయితే ఈ నెల 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
ప్రదీప్ రంగనాథన్ టైటిల్ ను మార్చుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్ డ్రాగన్ కు ఇబ్బందులు తప్పినట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ సమయానికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2026 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
మరోవైపు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఈ సినిమాను సైతం తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాను సైతం మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లో డ్రాగన్ స్పెషల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.