టాలీవుడ్ లో ఎన్నో ట్రాజిక్ లవ్ స్టోరీస్ తో వచ్చిన సినిమాలు చాలానే వున్నాయి.సాడ్ ఎండింగ్ తో ముగిసే ఈ సినిమాలు క్లాసిక్ గా నిలిచిపోయాయి.. అలాంటి మోస్ట్ క్లాసిక్ ట్రాజిక్ లవ్ స్టోరీస్ లో “7/G బృందావన కాలనీ” మూవీ ఒకటి.. తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన తమిళ్ సినిమా 7/G రెయిన్ బో కాలనీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ తెలుగులో “ 7/G బృందావన్ కాలనీ” టైటిల్ తో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది..

2004 లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించి క్లాసిక్ సినిమాలా నిలిచింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఎంతగానో పాపులర్ అయి ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది..ప్రాణం గా ప్రేమించిన తన లవర్ తన వల్లే అనుకోకుండా యాక్సీడెంట్ అవ్వడంతో స్పాట్ లోనే చనిపోతుంది.. అదే స్పాట్ లో వున్న హీరోకి కూడా యాక్సిడెంట్ అవుతుంది.. చివరకి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోవడం తో తను మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతాడు..

తాను కూడా సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తే తన లవర్ సోల్ వద్దని చెబుతుంది.. అప్పటి నుంచి తనతో మాట్లాడుతున్నట్లుగా, తనతోనే ఉంటున్నట్లుగా హీరో తన జ్ఞాపకాలతో జీవిస్తాడు.. ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిన లవర్స్ అంతా కచ్చితంగా చూస్తారు.. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది.. ఇటీవలే ఆ సీక్వెల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు..ఛాన్నాళ్లకు ఇలాంటి క్లాసిక్ మూవీకి సీక్వెల్ రూపొందుతుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: