సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ మరియు మెయిన్ లీడ్స్ కలిసి ఒక సినిమా కోసం పని చేశారు అంటే ఆ సినిమా ఎలా ఉంటుందా అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతూ ఉంటాయి. దాదాపుగా కొత్త దర్శకుడు , కొత్త ప్రధాన నటులు కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న దాఖలాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఇకపోతే కొత్త దర్శకుడు , కొత్త ప్రధాన నటులతో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో అందాల రాక్షసి మూవీ ఒకటి.

హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర , రాహుల్ రవీంద్రన్ హీరోలుగా నటించగా ... లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే హను రాగపూడి దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. అలాగే నవీన్ చంద్ర , రాహుల్ రవీంద్రన్ , లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇలా దాదాపు ఇంత మంది కొత్త వాళ్ళతో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను రూపొందించిన విధానానికి గాను హను రాఘవపూడి కి అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చాయి. ఇక ఈ మూవీ లో నవీన్ చంద్ర , రాహుల్ రవీంద్రన్ , లావణ్య త్రిపాఠి ముగ్గురు కూడా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సినిమా తర్వాత వీరికి తెలుగులో అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. ఇప్పటికి కూడా వీరు ముగ్గురు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయన కూడా ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ కలిగిన డైరెక్టర్ గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: