శ్యామ్ సింగరాయ్.. నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ గా రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో వచ్చిన మూవీ శ్యామ్ సింగరాయ్.. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పిరియాడికల్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరికెక్కింది ఈ సినిమా.. అయితే ఈ సినిమాలో ఒక వెరైటీ ఆఫ్ లవ్ స్టోరీని చూపించారు.సినిమాల మీద పిచ్చి ఉండే వాసు పాత్రలో మొదట నాని కనిపిస్తారు. అలా నాని ఓ షార్ట్ ఫిలిం తీయడానికి హీరోయిన్ ని వెతుకుతున్న సమయంలో కృతి శెట్టిని కలుస్తాడు. కృత్తి శెట్టిని ఒప్పించి తన షార్ట్ ఫిలింలో తీసుకుంటాడు. అలా షార్ట్ ఫిలిం చేసే  సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడతారు.ఆ తర్వాత షార్ట్ ఫిలిం నచ్చినా ఓ ప్రొడ్యూసర్ నీతో సినిమా తీస్తాను అంటారు.అలా శ్యామ్ సింగరాయ్ స్టోరీని తెలియకుండానే నాని తీస్తారు. అయితే ఇది బాగా హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని కొంతమంది అడుగుతారు.

 దాంతో సడన్గా అప్పుడే పోలీసులు వచ్చి ఎస్సార్ పబ్లిషర్స్ మీపై కేసు పెట్టారు.మీరు వాళ్ల రచనల్ని కాపీ చేశారని చెప్పడంతో కోర్టుకు వెళ్లిన నాని లేదు అది నేనే స్వయంగా రాసాను కావాలంటే లై డిటెక్టర్ పెట్టండి అని చెబుతాడు.ఇక లై డిటెక్టర్ లో అన్నీ నిజాలే చెబుతాడు నాని. దాంతో అర్థం కాని జడ్జ్ నానికి బెయిల్ మంజూరు చేస్తాడు. కానీ కాపీ చేయనట్టు నిరూపణ కావాలి అని అడుగుతాడు. దాంతో కృతి శెట్టి నాని ప్రవర్తన చూసి ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అదే సమయంలో కృతి శెట్టి ప్రొఫెసర్ నానిని హిప్నోటైస్ చేసి గతం బయటికి తీస్తారు. అలా గత జన్మలో బెంగాల్లో శ్యామ్ సింగరాయ పాత్రలో అవినీతిని నిర్మూలించి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే పాత్రలో నాని కనిపిస్తారు.ఇక గతంలో నానికి సాయి పల్లవి తో లవ్ స్టోరీ ఉంటుంది పెళ్లి కూడా చేసుకుంటారు. 

పెళ్లయ్యాక శ్యామ్ సింగరాయ్ రాసే రచనలు పత్రికలో ఫేమస్ అయ్యి ఆ తర్వాత ఆయన రాసే రచనలతో బుక్స్ ప్రింటింగ్ చేస్తారు. అలా శ్యామ్ సింగరాయ్ తన అన్న చేతిలో ఫ్లాష్ బ్యాక్ లో చనిపోతాడు. ఇదంతా నాని తన గతం గురించి చెబుతారు.అయితే ఇదంతా నాని చెబుతున్నప్పుడు వీడియో తీసి కోర్టులో చూపిస్తారు.కానీ కోర్ట్ నమ్మకపోవడంతో శ్యాం సింగరాయ చిన్నన్న వచ్చి ఇదే నిజం వాసు శ్యామ్ సింగరాయ్.. మళ్లీ పుట్టాడు అంటూ అసలు నిజం చెప్తాడు.ఆ తర్వాత తన భార్య సాయి పల్లవి ని కూడా సీక్రెట్ గా దాచేసినట్టు శ్యాం సింగరాయ అన్న చెప్పడంతో అక్కడికి శ్యాం సింగరాయ్ చేరుకుంటాడు. అయితే అప్పటికే సాయి పల్లవి ముసలిది అయిపోతుంది. నాకోసం మళ్లీ పుట్టావు అని నాని చేతుల్లోనే సాయి పల్లవి మరణిస్తుంది. ఇక ఈ సినిమా చూసిన చాలామంది షాక్ అవుతారు.ఎందుకంటే పునర్జన్మలు ఉండవు అని అనుకునే వారికి ఈ సినిమా ద్వారా పూర్వజన్మలు కూడా  ఉంటాయని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: