నాని,నివేద థామస్, ఆది పినిశెట్టి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన నిన్ను కోరి మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హీట్ అయింది.. శివ నిర్మాణ డైరెక్షన్లో డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం ఎలా మార్పులు తిరుగుతుంది అనేది చూపించారు. మొదట హీరో నాని ప్రేమలో నివేద థామస్ పడుతుంది.ఆ తర్వాత నాని తన డ్రీమ్ పీహెచ్డీ చేయడం కోసం వెళ్ళిపోతాడు. ఆ సమయంలో హీరోయిన్ పెళ్లి చేసుకుందామని చెప్పినా వినకుండా పిహెచ్డి అనేది నా డ్రీమ్ అని హీరోయిన్ ఒప్పించి వెళ్తాడు. కానీ తన మాట కాదని వెళ్ళినందుకు హీరోయిన్ ఒక్కసారి కూడా హీరోతో ఫోన్ మాట్లాడదు. ఆ తర్వాత తనకు పెళ్లిచూపులు జరిగి పెళ్లి జరిగే విషయాన్నీ చెబుదామనుకునే  అదే సమయానికి నాకు జాబ్ వచ్చేస్తుంది అని నాని అంటాడు.దాంతో ఇప్పుడు ఈ పెళ్లి విషయం చెబితే నాని పరిగెత్తుకుంటూ తన జాబ్ ని వదిలేసి వస్తాడు అని నివేద థామస్ ఆలోచించి నానికి చెప్పకుండానే పెళ్లి చేసుకుంటుంది.

అయితే పెళ్లయింది అనే విషయం తెలిసిన నాని పిచ్చివాడు అయిపోతాడు. పెద్ద జాబ్ వచ్చినా కూడా తరచూ డ్రింక్ తాగుతూ ప్రియురాలి ఆలోచన లోనే బతుకుతాడు. దాంతో ఇదంతా చూడలేని నాని కి చదువు చెప్పిన టీచర్ నివేదా థామస్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెబుతాడు.దాంతో ఎలాగైనా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మార్చి మళ్లీ మామూలు మనిషిని చేయాలని పెళ్లయ్యాక తన భర్తతో ఎంత బాగా కలిసి ఉంటుందో చూడడం కోసం ఏకంగా ఇంట్లోనే తెచ్చి పెట్టుకుంటుంది. అలా ఇంట్లో వీళ్ల ముగ్గురి మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు చూసే వారిని ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా పెళ్లయ్యాక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ ఈ సినిమాలో ఆది పినిశెట్టి మాత్రం దానికి ఒప్పుకుంటాడు.

అయితే మీరు ఇద్దరు విడిపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ నాని చెబుతాడు. కానీ మా మధ్య ఎంత ప్రేమ ఉందో నీకు నిరూపిస్తాను అని నివేదా అంటుంది. ఆ తర్వాత వీరి మధ్య ఉన్న ప్రేమకి నాని సైతం ఫిదా అయి చివరికి విడిపోయే స్టేజ్ లో ఉన్న ఆది పినిశెట్టి నివేద థామస్ లను మళ్ళీ కలుపుతాడు.అలా ఒక హ్యాపీ ఎండింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా లో లవ్ ఫెయిల్యూర్ అయ్యాక జీవితాన్ని నాశనం చేసుకున్న అబ్బాయి జీవితాన్ని అమ్మాయి కాపాడుతుంది. అలా పెళ్లయ్యాక మాజీ ప్రియుడు ఎక్కడ పోతే నాకెందుకులే అని ఆలోచించకుండా అతని గురించి అతని లైఫ్ గురించి ఆలోచిస్తుంది. అలా ఈ సినిమా చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: