తాజాగా టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సాహు గారపాటి నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో లైలా మూవీ లో ముఖ్య పాత్రలో నటించిన పృథ్వీరాజ్ కూడా పాల్గొన్నాడు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈయన లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఇన్ డైరెక్ట్ గా వైసిపి పార్టీని , ఆ పార్టీ ఎమ్మెల్యేలను నొప్పించే విధంగా కొన్ని సంభాషణలు చేశాడు అని , ఆ సంభాషణలు పూర్తిగా తప్పు అని , అందుకే ఆ సినిమాను బై కాట్ చేస్తున్నాము అని వైసిపి నేతలు , కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వచ్చారు. దీనితో ఈ సినిమా హీరో అయినటువంటి విశ్వక్ సేన్ అందుకు క్షమాపణలు కూడా బహిరంగంగా చెప్పాడు. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో నేను అక్కడ లేను. చిరంజీవి గారు వచ్చారు అంటే నేను బయటకు వెళ్లి ఆయనను రిసీవ్ చేసుకున్నాను. ఆ సమయంలోనే ఆయన స్పీచ్ జరిగింది.

అసలు ఆయన అలా మాట్లాడిన విషయం కూడా నాకు ఆ తదుపరి రోజు తెలిసింది. దయచేసి ఆయన మాటల వల్ల ఈ సినిమాను బాయ్ కాట్ చేయకండి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే చాలా మంది పృథ్వీరాజ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కేవలం హీరో మరియు నిర్మాతకు మాత్రమే ప్రాబ్లం అని , ఇతరులకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని , కానీ వారి ఇద్దరు కూడా ఎలాంటి తప్పు చేయలేదు. అనవసరంగా వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్త పరుస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs