![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mokshagna9e5b8d72-bda1-4a62-9e23-146238502a97-415x250.jpg)
ఫైనల్లీ ప్రశాంత్ వర్మ చేతిలో ఆ బాధ్యతలను పెట్టాడు బాలయ్య . అందరూ కూడా హ్యాపీగానే ఫీలయ్యారు. కాగా ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను సరిగా డైరెక్ట్ చేయలేకపోతున్నాడు అని.. సినిమాపై బాగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడని.. బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నాడు అని ..అదే మోక్షజ్ఞ లైఫ్ కి బిగ్ రిస్క్ గా మారబోతుంది అంటూఉ బాలయ్య కోపడిపోయారట.
ఆ కారణంగానే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను ప్రశాంత్ వర్మ చేతిలో నుంచి నాగ్ అశ్వీన్ చేతుల్లోకి మార్చేశాడు బాలయ్య అంటూ ఓ న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే నాగ్ అశ్వీన్ ని కూడా కలిశారట. మోక్షజ్ఞ లుక్స్ పై.. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మోక్షజ్ఞ పేరు మారుమ్రోగిపోతుంది. మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ నాగ్ అశ్వీన్ చేతుల్లో పడింది అంటే మోక్షజ్ఞ లైఫ్ కి ఇక తిరుగు ఉండదు అంటున్నారు నందమూరి అభిమానులు . ఒకే ఒక్క న్యూస్ తో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాడు మోక్షజ్ఞ . చూడాలి మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..???