![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chiranjeevi-39eba7d2-da94-4c96-8688-35223e7130de-415x250.jpg)
టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సందడి తగ్గింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలలో బాలయ్య డాకు మహారాజ్ - వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రెండు మంచి సక్సెస్ అయ్యాయి. వెంకీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ దృష్టి అంత సమ్మర్ .. ఆ తర్వాత దసరా ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పై పడింది. ఈ సీజన్లో సంక్రాంతి సినిమాలు కాసుల వర్షం కురిపించడంతో సహజంగానే వచ్చే సంక్రాంతిపై కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ సంక్రాంతి సీజన్ కు లాక్ చేశారు. 2026 జనవరి 9న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమా డ్రాగన్ అన్న టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సినిమా కూడా వచ్చేసింది. అనిల్ రావిపూడి - చిరంజీవి సినిమా ను కూడా సంక్రాంతి విడుదల చేస్తామని నిర్మాత సాహు గారపాటి ప్రకటించారు. అయితే ఇవన్నీ పైన చెబుతున్న మాటలే ఆ టైం కు వచ్చేసరికి ఎన్నో లెక్కలు మారిపోతాయి.
ఇంకొన్ని సినిమాలు లైన్లోకి వచ్చేస్తాయి. చిరంజీవి - రావిపూడి సినిమాపై మాత్రం కాస్త నమ్మకంగా ఉన్నారు జనాలు. సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఎడాది సంక్రాంతి వస్తున్నాం సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. దీంతో సంక్రాంతి సీజన్ ఇతడికి సెంటిమెంట్ గా మారింది. అటు చిరంజీవి కూడా సంక్రాంతికి వచ్చి చాలా రోజులు అయింది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తో సంక్రాంతి వచ్చి మంచి హిట్ కొట్టారు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా అనుకున్న టైం కు షూటింగ్ జరుపుకుంటున్న ... అనుకున్న టైం కు వస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ కైనా అటు ప్రశాంత నీల్‌కైనా ఏడాది టైం చాలా తక్కువ .. వాళ్లకు ఇంకా ఎక్కువ టైం కావాలి అదే అనిల్ రావిపూడి కి ఐదు నెలలు సరిపోతుంది. అందుకే చిరంజీవి వెర్సెస్ ఎన్టీఆర్ పోటీ అనేది కాస్త అనుమానమే అని చెప్పాలి.