![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/why-did-pushpa-2-flop-in-kerala31ee927c-5b9a-476d-bc44-7b7fcd1f2d67-415x250.jpg)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర నమ్మలేని విధంగా దూసుకుపోయింది. మరియు ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు .. అభిమానులు ట్రేడ్ వర్గాలను .. విశ్లేషకులను ... సినిమా పరిశ్రమ ను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా హిస్టారికల్ నెంబర్లు నమోదు చేసింది. కన్నడ - తమిళ - మలయాళీ భాషలో మాత్రం నష్టాలు మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా మొత్తంగా ఈ సినిమా రెండు వేల కోట్ల మార్క్ దాటేసింది. అల్లు అర్జున్ కు కేరళలో అభిమానులు ఎక్కువ .. అల్లు అర్జున్ నటించిన సినిమాలు తెలుగులో డిజాస్టర్ అయిన కూడా కేరళలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
అయితే పుష్ప పార్ట్ 2 సినిమా కేరళలో ఎందుకు డిజాస్టర్ అయింది అన్నదానిపై కేరళ డిస్ట్రిబ్యూటర్ ముఖేష్ ఆర్ మెహతా క్లారిటీ ఇచ్చారు. అక్కడ మంచి ఓపెనింగ్స్ కి వచ్చాయని ... కేరళ స్టార్ హీరోలకు కూడా రాని స్థాయిలో పుష్ప టు సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. పుష్ప 2 మలయాళీ స్టైల్ సినిమా కాదని అందుకే కాస్త లేటుగా కనెక్ట్ అవుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాని డిజిటల్ ప్లాట్ఫారం లో ఎక్కువ మంది చూస్తున్నారని ఆయన చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను అక్కడ మళ్ళీ త్రీడీ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నట్టు కూడా చెప్పారు.
అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. కేరళలో అల్లు అర్జున్ కు భయంకరమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లంతా గతంలో అల్లు అర్జున్ మాస్ మసాలా సినిమాలు చూసి ఎంజాయ్ చేశారు అయితే అక్కడ స్టార్ హీరోగా ఉన్న ఫాహద్ ఫాజిల్‌ను విలన్ గా చూపించడంతోపాటు ... చాలా దారుణంగా అతని పాత్ర చిత్రీకరించడం మలయాళీ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని అందుకే ఈ సినిమాను వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.