ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎక్కడికి వెళ్లినా కూడా ఒకే ఒక్క సినిమా పేరు చెబుతున్నారు. అదే సంక్రాంతి వస్తున్నాం.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం..ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు ఇద్దరు హీరోయిన్లుగా తమ నటనతో ఇరగదీసారు. అయితే ఈ సినిమా ట్రైలర్ తో ఆకట్టుకోక పోయినప్పటికీ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హీట్ అయింది. ఈ సినిమా ఇప్పటికి కూడా థియేటర్లలో ఆడుతుంది అంటే వెంకీ మరోసారి మ్యాజిక్ చేశారని అనుకోవచ్చు. అయితే ఈ సినిమా క్రెడిట్ వెంకీ తో పాటు డైరెక్టర్ కి కూడా ఇవ్వాల్సిందే. చాలా రోజుల తర్వాత వెంకీ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. 

అయితే సినిమా హిట్ అయిన విషయం పక్కన పెడితే అనిల్ రావిపూడి ఎక్కడికి వెళ్లినా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించే మాట్లాడుతున్నారు ఆ సినిమా పేరే తలుస్తున్నారు.దాంతో చూసిచూసి విసిగిపోయిన ఓ నిర్మాత అనిల్ రావిపూడి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా విశ్వక్ సేన్ చేసిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా అనిల్ రావిపూడి కూడా వెళ్లారు.అయితే ఆ ఈవెంట్లో స్టేజ్ ఎక్కిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్లాడడంతో అక్కడే ఉన్న డైరెక్టర్ సాహు గార్లపాటి ఇక నీ పబ్లిసిటీ ఆపు..

ఇంకేన్ని రోజులు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరు చెప్పుకొని వేలాడుతావ్.. ఇప్పటికైనా ఆపేసి మన సినిమాలోకి ఎప్పుడు వస్తావో చెప్పు.. అన్నట్టుగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఆయన కౌంటర్ కి అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ.. సారీ ఇప్పటినుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇంకో ఈవెంట్ అయిపోయాక అన్నయ్య సినిమాని తెరకెక్కిస్తాను అంటూ అనిల్ రావిపూడి చెప్పారు. ప్రస్తుతం అనిల్ రావిపూడికి నిర్మాత సాహూ గార్లపాటి ఇచ్చిన కౌంటర్ నెట్టింట  వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: