![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroines4ec65843-8530-4053-a2bb-c65025bd5436-415x250.jpg)
సినిమా ఇండస్ట్రీలో హీరోల పక్కన నటించిన హీరోయిన్లకు వయసు తేడా పట్టింపు ఉండదు. హీరోయిన్లు వయసు తేడా అసలు పట్టించుకోరు. తండ్రితో నటించిన హీరోయిన్ తో కొడుకు రొమాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవితో అక్కినేని నాగేశ్వరరావు రోమన్ చేస్తే .. అదే శ్రీదేవి నాగార్జునకి జోడిగా హీరోయిన్గా నటించింది. అలాగే నాగచైతన్య హీరోయిన్తో నాగార్జున .. ఎన్టీఆర్ హీరోయిన్ తో బాలయ్య ఇలా తండ్రి కొడుకులు ఒకే హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ రొమన్స్ చేస్తున్నారు. అలాగే నందమూరి హీరోలుగా ఉన్న బాలకృష్ణ ... ఎన్టీఆర్ ఇద్దరితోను స్టెప్పులేసిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.
బాలకృష్ణ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్లలో ముందు కాజల్ అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొడుకులు నటించిన తర్వాత తండ్రులు ఆ హీరోయిన్లతో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసింది. బృందావనం - బాద్షా - టెంపర్ ఈ మూడు సినిమాలలో కాజల్ నటించగా ... ఈ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా ఎన్టీఆర్ - కాజల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా నిలిచింది. ఇక బాలయ్య - కాజల్ కాంబినేషన్లో సినిమాలు రాలేదు అన్న చర్చి నడిచింది. అదే టైంలో బాలకృష్ణతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ సినిమాలో కాజల్ తొలిసారిగా బాలయ్య సరసన నటించి మెప్పించింది.
ఇక ఎన్టీఆర్ తో తక్కువ సినిమాలు చేసి బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ని కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు నయనతార కాజల్. అయితే ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసి బాలయ్యతో ఒక సినిమా చేసింది.. కానీ నయనతార మాత్రం బాలయ్యతో మూడు సినిమాలు చేసి ఎన్టీఆర్ తో ఒక్క సినిమా మాత్రమే చేసింది. తారక్ - నయనతార కాంబినేషన్లో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా మాత్రమే చేసిన నయనతార బాలయ్యతో మూడు సినిమాలు చేసింది. బాలకృష్ణ - నయనతార కాంబినేషన్లో సింహ - జై సింహ - శ్రీరామరాజ్యం సినిమాలో వచ్చాయి. ఈ మూడు సినిమాలు హిట్ అవ్వగా సింహ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఎన్టీఆర్‌కు నాన్నకు ప్రేమతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలయ్య బాబుతో ఒక సాంగ్లో మాత్రం గెస్ట్ గా కనిపించింది.