![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-74baf4bd-c057-4404-9d0d-b338fd3b79f9-415x250.jpg)
ఇక తాజాగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించాడు. ఆయన సోషల్ మీడియా వేదికగా పృథ్వీకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. 'రాజకీయం, సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి. ఆల్ ది బెస్ట్ టూ లైలా' అంటూ రాసుకొచ్చారు.
ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్‌లో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రామ్ నారాయణ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా తొలి పరిచయం ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ నటించిన అన్నీ మూవీస్ లో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండేది. మాస్ కా దాస్ పాత్రలలో తెరపై కనిపించే విశ్వక్.. ఇప్పుడు ఈ సినిమాలో లేడి కేటాప్ లో అదరగొట్టనున్నారు.