నమిత .. ఒకప్పుడు తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా మారిన హీరోయిన్ నమిత. ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అలాగే బుల్లితెరపై కొన్ని షో లు చేసుకుంటూ కొనసాగుతున్నారు. ఒకప్పుడు కుర్రాళ్ళ ఆరాధ్య దేవతగా పాపులర్ అయిన నమితకు అప్పట్లో ఒక హీరోతో బ్రేకప్ జరిగిందట. ఆ హీరో ఉన్నదంతా ఉడిచేసి ఆమెను వదిలించుకున్నాడట. ఇంతకీ నమిత అంత గాఢంగా ప్రేమించిన ఆ హీరో ఎవరు ఆ స్టోరీ ఏంటో చూద్దాం. హీరోయిన్ నమిత ఒకప్పుడు ఆ హీరోతో ప్రేమలో ఉందని కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అయింది. ఆ హీరో ఎవరో కాదు ? ప్రేమిస్తే మూవీతో ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యి ఓవర్ నైట్ తో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న భరత్ కుమార్. అయితే ఆ హీరోతో ఓ సినిమాలో నటించే సమయంలో ఇద్దరు మధ్య ప్రేమ ఏర్పడి ఇద్దరు కలిసి డేటింగ్ చేశారని వార్తలు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి.


ఇద్దరి మధ్య రిలేషన్ న‌డ‌వ‌డంతో నమిత తనకు వచ్చిన డబ్బులు ఇతర వ్యవహారాలు అన్ని హీరో భరత్ కుమార్ కి అప్పజెప్పిందట. అలా భరత్ నమిత దగ్గర ఉన్నదంతా ఊడి చేసుకున్నారని పుకారులు కొలీవుడ్ మీడియాలో వినిపించాయి. అదే సమయంలో నమితకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో చేసేది ఏమి లేక అవకాశాల కోసం కొంతమంది హీరోలతో క్లోజ్ గా ఉండటం చూసిన భరత్ కుమార్ కు నచ్చక బ్రేకప్ చెప్పుకుని విడిపోయారన్న గుసగుసలు కూడా వచ్చాయి. ఆ సమయంలో తనకి అప్పజెప్పిన డబ్బు తిరిగి ఇచ్చేయమని నమిత అడిగితే ... నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు ఆ డబ్బులు అన్ని నీకోసమే ఖర్చు పెట్టా .. నీది నువ్వే తీసుకున్నవు నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని మొండి చేయి చూపించాడన్న పుకార్లు కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపించాయి.


ఆ టైంలో నమిత అన్ని విధాలుగా ఇబ్బందులు పడి చాలా డిప్రెషన్ లోకి వెళ్లి ఆ బాధ నుంచి కోలుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడిందన్న ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత వయసులో తనకంటే చిన్నవాడు అయినా ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు. ఇక నమిత ... భరత్ కుమార్ ను ప్రేమించి మోసపోయింది అన్న విషయం అప్పట్లో అయితే ఓ సెన్సేషనల్.

మరింత సమాచారం తెలుసుకోండి: