ఏంటి ఈ సీనియర్ నటి మరో హీరోయిన్ నక్లెస్ దొంగలించిందా.. ఇది నిజమేనా.. మరి ఇంతకీ ఆ  నెక్లెస్ కి సంబంధించి వార్తల్లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే సీనియర్ నటి రేఖ.. ఒకప్పుడు కుర్రాళ్ల కళల రాకుమారిగా పేరు తెచ్చుకున్న రేఖ ఇప్పటికి కూడా చెక్కుచెదరని అందంతో మెరిసిపోతుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన యంగ్ హీరోయిన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అయితే అలాంటి రేఖ తాజాగా ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లిలో కనిపించింది. అయితే పెళ్లికి రావడం బాగానే ఉంది కానీ రేఖ తన మెడలో వేసుకున్న నెక్లెస్ గురించి ప్రస్తుతం బీ టౌన్ లో సరికొత్త చర్చ జరుగుతుంది. 

అదేంటంటే.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లిలో రేఖ తన మెడలో వేసుకున్న నెక్లెస్ ప్రియాంక చోప్రా తన పెళ్లికి వేసుకున్న నక్లెస్ రెండు సేమ్ టు సేమ్ ఉండడంతో ఈ రెండు ఫోటోలను ఒకే దగ్గర పెట్టి చూస్తూ ప్రియాంక చోప్రా నక్లెస్ ని రేఖ తన మెడలో వేసుకుంది అని కొంతమంది పోస్టులు పెడుతుంటే.. మరి కొంతమందేమో ఫన్నీగా సీనియర్ నటి రేఖ ప్రియాంక చోప్రా దగ్గర నెక్లెస్ ని దొంగలించింది కావచ్చు అని మరి కొంత మంది ఫన్నీ ఏమోజీలు పెడుతూ పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం నటి రేఖ మెడలో ఉన్న నెక్లెస్ అలాగే ప్రియాంక చోప్రా పెళ్లికి వేసుకున్న నెక్లెస్ కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక రీసెంట్ గానే ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి తెగ హడావిడి చేసింది. అలాగే ఈ పెళ్లికి బాలీవుడ్ నుండి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక ప్రియాంక చోప్రా హృతిక్ రోషన్ కలిసి నటించిన క్రిష్ 3 లో సీనియర్ నటి రేఖ కూడా ఒక కీలక పాత్రలో నటించింది. అప్పటినుండి ప్రియాంక చోప్రా రేఖల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది

మరింత సమాచారం తెలుసుకోండి: